Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కన్నబిడ్డ నోటిని కట్టేశాడు.. ఒంటరిగా నిద్రించిన కూతురిని కాటేశాడు.. ఎక్కడ?

శనివారం, 3 జూన్ 2017 (14:47 IST)

Widgets Magazine

కన్నబిడ్డను కంట్లో పెట్టి చూసుకోవాల్సిన తండ్రే కాటేశాడు. తండ్రులే తన ఆడకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడే ఘటనలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా రాజమహేంద్రవరంలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరుకు చెందిన ఓ వ్యక్తి పదిహేనేళ్ల క్రితం కాకినాడకు చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 14 ఏళ్ల కుమారుడు 11 ఏళ్ల కుమార్తె ఉన్నారు.
 
కానీ భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. కుటుంబాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. చెడు అలవాట్లకు బానిస అయిన భర్తను వదిలేసిన భార్య మూడేళ్ల క్రితం దుబాయ్ వెళ్ళిపోయింది. పిల్లలను తల్లి ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళింది. అప్పటినుంచి అమ్మమ్మ ఇంట్లోనే చదువుకుంటున్న పిల్లలు.. ఇటీవల కొంతమూరులోని తండ్రి వద్దకు వెళ్లారు. నానమ్మ తాతయ్యలతో పాటు తండ్రిని చూడటానికి గత నెల 13వ తేదీన అక్కడికి వెళ్లారు. 
 
అయితే కరెంట్ లేకపోవడంతో అంతా బయటే నిద్రించారు. చిన్నారి మాత్రం ఒంటరిగా ఇంట్లో పడుకుంది. ఆ రాత్రి 12 గంటల సమయంలో ఒంటరిగా నిద్రిస్తున్న కుమార్తెపై కామంతో కళ్లుమూసుకుపోయి తండ్రే అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక అరుపులు వినిపించకుండా నోటిని కట్టేసి ఈ పాడు పని చేశాడు. ఈ విషయాన్ని బాలిక అమ్మమ్మకు చెప్పింది. దీంతో బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించి పలు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కుమార్తెపై అత్యాచారానికి ఒడిగట్టిన తండ్రి తనపై కేసు నమోదైందని తెలియగానే కిరోసిన్ తాగాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రేమికులూ... విశాఖ బీచ్, పార్కులకు వెళ్లకండి.. నకిలీ పోలీసులున్నారు జాగ్రత్త!

ప్రేమికులు పార్కుల వెంట, బీచ్‌ల వెంట తిరిగుతున్నప్పుడు జాగ్రత్త పడాలి ఎందుకంటే నకిలీ ...

news

మనిషి ఆకారంలో లేగదూడ.. చనిపోయినా కళేబరానికి పూజలు.. విష్ణుమూర్తి అంటూ?

గోపూజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గోమాంసం నిషేధానికి సంబంధించి ప్రస్తుతం ...

news

అలా మాట్లాడితే రోజా నాలుక కోస్తాం... ఎవరు..?(video)

వైసిపి ఎమ్మెల్యే రోజా హిందూ వ్యతిరేకిగా మారారని మండిపడ్డారు శివసేన పార్టీ చిత్తూరు జిల్లా ...

news

డబ్బుకోసం ఏం చేసిందంటే? ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిల ఫోటోలను?

డబ్బు కోసం ఆ యువతి ఫేస్‌బుక్‌ను ఎంచుకుంది. అందమైన అమ్మాయిలను వాడుకుంది. ఫేస్‌బుక్ ...

Widgets Magazine