శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2017 (09:32 IST)

ఫిలిబిత్‌ను వణికిస్తున్న పెద్దపులి.. నాలుగు రోజుల్లోనే ముగ్గురిని చంపేసింది..

మధ్యప్రదేశ్‌‌లోని ఫిలిబిత్‌కు సమీపంలోని భేరీ గ్రామాన్ని పెద్దపులి వణికిస్తోంది. దీంతో ఆ గ్రామ ప్రజలు నిద్రకు దూరమైనారు. ఇప్పటికే భేరీ గ్రామానికి చెందిన నలుగురు పులి బారిన పడి ప్రాణాలు కోల్పోగా, మరో వ్

మధ్యప్రదేశ్‌‌లోని ఫిలిబిత్‌కు సమీపంలోని భేరీ గ్రామాన్ని పెద్దపులి వణికిస్తోంది. దీంతో ఆ గ్రామ ప్రజలు నిద్రకు దూరమైనారు. ఇప్పటికే భేరీ గ్రామానికి చెందిన నలుగురు పులి బారిన పడి ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తిని పులి చంపి తినేసింది. వివరాల్లోకి వెళితే.. భేరీ సమీపంలోని రిజర్వ్ ఫారెస్టు నుంచి పెద్దపులి గ్రామానికి వచ్చి గ్రామస్తులపై దాడి చేసినట్లు అధికారులు చెప్తున్నారు. 
 
ఇప్పటికే పొలంలో పనిచేస్తున్న కున్వర్ సేన్ (45) అనే వ్యక్తిపై తీవ్రంగా గాయపరిచిందని.. నాలుగు రోజుల్లోనే ముగ్గురిని చంపేసిందని అధికారులు వెల్లడించారు. పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిపారు. ఇంకా మూడు నెలల కాలంలో ఐదుగురిని పెద్దపులి పొట్టనబెట్టుకుందని అధికారులు తెలిపారు. రైతులే పులి దాడి అధికంగా బలవుతున్నారని అధికారులు చెప్పుకొచ్చారు.