శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (07:59 IST)

కాశ్మీర్ లో ఫిఫ్టీ... ఫిఫ్టీ.. రేపు సిఎం, మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం

కాశ్మీర్ లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ఎన్నికలు జరిగి చాలా కాలమే అయినా ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. దానికి శుక్రవారంతో తెరపడింది. బిజేపీ, పిడిపిలు ఓ అంగీరానికి వచ్చాయి. కాశ్మీర్ లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. ఇందులో కూడా అధికారాలను ఫిఫ్టీ ఫిఫ్టీగా పంచుకోవాలని నిర్ణయించారు. ఆదివారం కాశ్మీర్ లో ముఖ్యమంత్రి, మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. వివరాలిలా ఉన్నాయి. 
 
పీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. రాజకీయ స్థితిగతులు జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటు, ఉమ్మడి ప్రణాళికపై చర్చించినట్లు  సమాచారం. అంతకు మునుపు పార్టీల ఒప్పందంలో ఎవరెవరు ఏ పదవులు అలంకరించాలనే అంశంపై ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి పదవి పీడీపీకి ఇచ్చేయాలనే అంశం తెలిసిందే. 
 
అయితే మంత్రివర్గంలో ప్రస్తుతానికి 25 మందిని తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో 13 మంత్రి స్థానాలు పీడీపీకి ఇస్తే.. 12 స్థానాలు బిజేపీకి ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ఉప ముఖ్యమంత్రి పదవి కూడా బీజేపీకి దక్కేలా రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా పగ్గాలు  పీడీపీ ముఫ్తీ మొహమ్మద్ సయీద్ మార్చి 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  రాష్ట్రానికి సయీద్ ఆరేళ్లపాటు సీఎంగా కొనసాగుతారని, బీజేపీ నేత నిర్మల్ సింగ్ డిప్యూటీ సీఎంగా ఉంటారని సమాచారం.