గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2017 (16:37 IST)

మన్నార్ గుడి మాఫియా చర్యల్లో ఇదొక భాగం: ఓ. పన్నీర్ సెల్వం

తమిళనాడు రాష్ట్ర శాసనసభలో చోటుచేసుకున్న సంఘటనలు మన్నార్ గుడి మాఫియా చర్యల్లో ఒక భాగమని మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ధ్వజమెత్తారు. శాసనసభ వేదికగా శనివారం జరిగిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి కె.పళనిస

తమిళనాడు రాష్ట్ర శాసనసభలో చోటుచేసుకున్న సంఘటనలు మన్నార్ గుడి మాఫియా చర్యల్లో ఒక భాగమని మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ధ్వజమెత్తారు. శాసనసభ వేదికగా శనివారం జరిగిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి కె.పళనిస్వామి ప్రభుత్వం విజయం సాధించింది. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... శాసనసభలో మాఫియా తిష్టవేసిందని అన్నారు. న్యాయం కోరితే దాడి చేశారని ఆరోపించారు. అమ్మ అశయాలకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే సభ్యులు నడుచుకుంటున్నారని చెప్పారు. ప్రతిపక్షాలు లేకుండా ఓటింగ్ జరపడం సరైన విధానం కాదని ఆయన చెప్పారు. అన్యాయంగా కొట్టి, తిట్టి బయటకు నెట్టేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అసెంబ్లీ సాక్షిగా శశికళ వర్గం ధర్మాన్ని, న్యాయాన్ని ఖూనీ చేసిందని పన్నీరు సెల్వం వర్గం మండిపడింది. శాసనసభ సాక్షిగా ధర్మాన్ని, న్యాయాన్ని ఖూనీ చేశారని చెప్పారు. జయలలిత అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. దీనిపై ప్రజాన్యాయస్థానంలో తేల్చుకుంటామని అన్నారు. ప్రజల్లోకి వెళ్లి జరిగిన దారుణాన్ని వివరిస్తామని వారు వెల్లడించారు. ఈ రోజు ఓడింది తాము కాదని, ధర్మం, న్యాయం ఓడిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.