ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: ఆస్పత్రిలో భయం భయం.. ఒక రోగి తప్ప..?
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో, పూత్ ఖుర్ద్‌లో ఉన్న.. బ్రహ్మశక్తి ఆస్పత్రిలో మంటలు వ్యాపించాయి. ప్రమాదం ఉదయం 5 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో రోగులు, వైద్య సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. బయటకు పరుగులు తీశారు.
అయితే, ఒక రోగి ఐసీయూలో గదిలో ఉన్నాడు. అతను చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతంతో దట్టమైన పొగలు వ్యాపించాయి.
స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
మంటలను ఆర్పేందుకు తొమ్మిది ఫైర్ ఇంజిన్‌లను ఆ ప్రాంతంలో తరలించారు. కాగా, వెంటిలేటర్ సపోర్టులో ఉన్న ఒక రోగి తప్ప మిగిలిన వారందరూ సురక్షితంగా రక్షించబడ్డారని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.