శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 10 అక్టోబరు 2020 (13:38 IST)

బాయ్‌ఫ్రెండ్‌ను చెట్టుకు కట్టేసి, 17 ఏళ్ల బాలిక తలపై తుపాకీ పెట్టి గ్యాంగ్ రేప్

జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో 17 ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి బగ్బెరా ప్రాంతంలో బాలిక తన ప్రియుడితో కలిసి వస్తోంది.
 
రోడ్డుపై వీళ్లిద్దరూ మాత్రమే వుండటంతో అటుగా వెళ్తున్న ఐదుగురు యువకులు అడ్డుకున్నారు. వారిని బలవంతంగా కాల్‌యాదిహ్ గౌషాలా వద్దకు లాక్కెళ్లారు. ఆ తర్వాత ఆమె ప్రియుడుని చెట్టుకు కట్టేసి బాలిక తలపై తుపాకీ గురి పెట్టి భయపెడుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు.
 
బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఐదుగురు నిందితులను అరెస్టు చేసారు. వీరిలో ఒకరు మైనర్ కావడంతో అతడిని బాల నేరస్థుల కారాగారానికి తరలించారు. కాగా వీరి వద్ద నుంచి దేశీయ పిస్టల్‌, రెండు లైవ్‌ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు.