శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 డిశెంబరు 2019 (15:42 IST)

లెస్బియన్లకు జెండా సమస్య వచ్చిపడింది.. సోషల్ మీడియాలో రచ్చ

ఒక దేశానికి, ఒక వర్గానికి, ఒక పార్టీకి లేదా ఒక సమూహాన్ని గుర్తించడానికి జెండాలను వాడుతుంటారు. లెస్బియన్ వర్గానికి కూడా ఒక ప్రత్యేక జెండా వుంది. ఇది ఇంద్ర ధనస్సును పోలినట్లు ఉంటుంది. అయితే.. ఈ వర్గంలో లెస్బియన్లు, గేలు, బైసెక్సువల్స్, ట్రాన్స్‌జెండర్లు, క్వీర్‌గా ఉన్నారు. వీరికి సంబంధించిన జెండాకు హాట్ పింక్-సెక్స్, రెడ్-లైఫ్, ఆరెంజ్-హీలింగ్‌గా అర్థాలు ఉన్నాయి.
 
అయితే.. లెస్బియన్లు మాకేం తక్కువ అనుకున్నారో ఏమో గానీ.. వారికంటూ ఓ ప్రత్యేక జెండాను రూపొందించుకున్నారు. అయితే.. పింక్ కలర్ కామన్‌గా ఉన్నా ఒక్కొక్కరు ఒక్కో తీరుగా జెండాను రూపొందించారు. 
 
కానీ ప్రస్తుతం అది సమస్యగా మారింది. ఏ జెండా సరైనదో తేల్చుకునే పనిలో పడ్డారు లెస్బియన్లు. అంతే.. సోషల్ మీడియా వేదికగా వాదనలు జోరందుకున్నాయి. తమకు తోచినట్ల జెండాను రూపొందించి ఇదే సరైనది అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ చర్చ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.