పిల్లల ఆన్లైన్ చదువుల కోసం మెడలో మంగళసూత్రం తాకట్టు పెట్టిన తల్లి

Mother and kids
శ్రీ| Last Modified శుక్రవారం, 31 జులై 2020 (12:51 IST)
కరోనావైరస్ సామాన్యులకు తీరని కష్టాలను తెచ్చిపెడుతోంది. చేసేందుకు పని లేక, తినడానికి తిండి లేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆన్లైన్ చదువుల మరింత ఇబ్బంది పెడుతున్నాయి.
విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు తల్లిదండ్రులు.

కర్ణాటక గడగ్ జిల్లాలో ఓ మహిళ తన బిడ్డల చదువు కోసం మెడలో పుస్తెల తాడు తాకట్టు పెట్టింది. ఆన్లైన్ చదువు కోసం టీవీలో తరగతులు చూడటానికి తమ పిల్లలకు టీవీ తెచ్చేందుకు రాడెర్ నాగనూర్ నరదుండకు చెందిన కస్తూరి అనే మహిళ తన మంగళ సూత్రాన్ని రూ. 20 వేలకు తాకట్టు పెట్టి టివిని కొనుగోలు చేసింది.

ఈ ఘటన చూస్తే సామాన్య కుటుంబానికి చెందిన విద్యార్థులు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అర్ధమవుతోంది.దీనిపై మరింత చదవండి :