Widgets Magazine

రాష్ట్రపతిగా రాజకీయేతర వ్యక్తి.. తెరపైకి శ్రీధరన్ పేరు : సోనియా ఏమన్నారు?

శుక్రవారం, 16 జూన్ 2017 (13:34 IST)

Widgets Magazine
esridharan

భారత రాష్ట్రపతి అభ్యర్థిగా రాజకీయేతర వ్యక్తిని ప్రతిపాదించాలని భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి భావిస్తే.. ఢిల్లీ మెట్రోమేన్‌గా పేరుగడించిన ఇ.శ్రీధరన్ పేరును తెరపైకి తెచ్చే అవకాశాలు ఉన్నట్టు జాతీయ ఎలక్ట్రానిక్ మీడియా కథనాల్లో పేర్కొంటున్నాయి. 
 
ఇప్పటికే, బీజేపీ తరపున పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఉన్నారు. తాజాగా ఎవరిని ఎంపిక చేస్తుందన్నది అత్యంత ఉత్కంఠగా మారింది. ఎవరిని ఆ అదృష్టం వరిస్తోందో గానీ, రకరకాల పేర్లు మాత్రం ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. ఢిల్లీ మెట్రో మాజీ చీఫ్ ఇ.శ్రీధరన్ పేరు ఇప్పుడు బయటకు వచ్చింది. ఒకవేళ రాజకీయేతర వ్యక్తినే ఎంచుకోవాల్సి వస్తే శ్రీధరన్ పేరును బీజేపీ పరిశీలించొచ్చన్నది సమాచారం. 
 
ఇదిలావుండగా, రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్‌లు రంగంలోకి దిగారు. ఇదే అంశంపై వారిద్దరూ శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమై చర్చించారు. అయితే, రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న విషయంపై స్పష్టత ఇవ్వకుండా ముందుగా మద్దతుపై మాట ఇవ్వడం సాధ్యంకాదని ఆమె తెగేసి చెప్పినట్టు సమాచారం. 
 
ఇంకోవైపు బీజేపీ అభ్యర్థి విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమై చర్చించారు. ఎన్సీపీ నేత శరద్ పవార్‌తోనూ శుక్రవారం భేటీ కానున్నారు. ప్రతిపక్షానికి ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంచుకోవాలని, అందరి ఆమోదంతో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటన చేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రేమించలేదనీ రోమియో ఏం చేస్తున్నాడో చూడండి (Video)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో అఘాయిత్యం చోటుచేసుకుంది. యువతి ప్రేమించలేదన్న కోపంతో ఓ రోమియో ...

news

ఎస్సై 2 గంటలు ప్రయత్నించినా లొంగని శిరీష...? తేజస్విని ఏం చెప్పింది?

బ్యూటీషియన్ శిరీషపై లైంగిక దాడి జరగడం వల్లే ఆమె మృతి చెంది వుంటుందని తొలుత భావించారు. ...

news

ప్రింటర్‌ను ఎత్తిపడేసిన జేసీ.. ఫ్లైట్‌లోకి అడుగుపెట్టనీయమంటున్న విమాన సంస్థలు...

ఎయిర్‌పోర్టులో పనిచేసే సిబ్బందిని.. ఎయిర్ హోస్టెస్‌ను చూస్తే వీళ్లెంత లక్కీ.. హ్యాపీగా ...

news

నిద్రిస్తున్న వ్యక్తిపై నిప్పంటించిన యువకులు.. వీడియో చూడండి

సోషల్ మీడియా ప్రభావంతో యువత రెచ్చిపోతోంది. చిన్న చిన్న ఈవెంట్లు జరిగినా ఫోటోలు, వీడియోలు ...