సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 31 జులై 2017 (17:55 IST)

బిజెపిలోకి మాజీ ప్రధాని మన్మోహన్? వద్దంటూ బుజ్జగిస్తున్న సోనియా?

భారతీయ జనతా పార్టీ సృష్టిస్తున్న ప్రభంజనానికి ఇప్పటికే ఎంతోమంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు అధికార పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏకంగా మాజీ ప్రధానే బిజెపిలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారనే వార్త చర్చనీయాంశంగా మారింది. ఆ విషయాన

భారతీయ జనతా పార్టీ సృష్టిస్తున్న ప్రభంజనానికి ఇప్పటికే ఎంతోమంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు అధికార పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏకంగా మాజీ ప్రధానే బిజెపిలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారనే వార్త చర్చనీయాంశంగా మారింది. ఆ విషయాన్ని నేరుగా సోనియాగాంధీకే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారంటూ వార్తలు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 
 
గత ఎన్నికల తరువాత దేశంలో కాంగ్రెస్ పార్టీకి లేవలేని దెబ్బ తగిలింది. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం మరో 25 యేళ్ళు ఎట్టి పరిస్థితుల్లోను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని. అందుకే చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు.
 
కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే ఎక్కువగా బిజెపిలోకి వెళుతున్నారు. మాజీ కేంద్రమంత్రులో లేకుంటే సీనియర్ కాంగ్రెస్ లీడర్లో ఎవరైనా సరే పార్టీని వదిలి వెళ్ళిపోతే ఫర్వాలేదు గానీ ఏకంగా ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తే పార్టీ మారిపోతుండడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి స్వయంగా రెండురోజుల క్రితం మన్మోహన్ సింగ్ ఈ వార్త చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సోనియా ఒక్కసారిగా అవాక్కయ్యారట. 
 
మీ ఇష్టమని చెప్పిన సోనియా ఆ తరువాత మన్మోహన్‌తో సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆయన్ను వెళ్లొద్దని చెప్పండి.. బుజ్జగించండి అని కోరారట. కానీ మన్మోహన్ మాత్రం బిజెపిలోకి వెళ్ళిపోవాలన్న నిర్ణయానికి వచ్చేశారట. మరి ఆ పార్టీ ద్వారా ప్రజలకు ఎలాంటి సేవలు చేయాలని చూస్తున్నారో...?