శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 2 నవంబరు 2019 (18:40 IST)

తీస్ హజారీ కోర్టులో పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణ

తీస్ హజారీ కోర్టులో పోలీసులు, న్యాయవాదుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో ఓ పోలీస్ వాహనం తగలబడగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పార్కింగ్ వివాదానికి సంబంధించిన వాదన సందర్భంగా ఒక పోలీసు అధికారి న్యాయవాదిపై కాల్పులు జరిపినట్లు నేషనల్ మీడియా పేర్కొనగా పోలీసు వాహనంపై నిప్పు పెట్టడం ద్వారా న్యాయవాదులు ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలిసింది.

నిరసనగా న్యాయవాదులు ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ను కూడా అడ్డుకున్నారు. గాయపడిన న్యాయవాదులను ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ ఆసుపత్రిలో చేర్చారు.