సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 30 మే 2022 (18:39 IST)

భారతీయ యువతకు 10 లక్షల ఉద్యోగాలు: ప్రధానమంత్రికి రాసిన లేఖలో గరుడ ఏరోస్పేస్‌ అగ్నీశ్వర్‌ జయప్రకాష్‌ వాగ్దానం

PM Modi
సుప్రసిద్ధ భారతీయ డ్రోన్‌ స్టార్టప్‌ గరుడ ఏరోస్పేస్‌ , భారతదేశంలో ఈ విభాగంలో అగ్రగామిగా వెలుగొందుతూనే ఆవిష్కరణలనూ చేస్తోంది. సమగ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని భారతదేశంలో డ్రోన్ల వినియోగం కోసం సృష్టిస్తామంటూ గరుడ, ఏరోస్పేస్‌ ఇటీవలనే భారత్‌ డ్రోన్‌ మహోత్సవ్‌ 2022 మొదటి ఎడిషన్‌లో పాల్గొంది. అక్కడ విభిన్న రంగాల కోసం తమ సాంకేతిక ఆఫరింగ్స్‌ను ప్రదర్శించింది. భారత్‌ డ్రోన్‌ మహోత్సవ్‌ 2022ను భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీని ద్వారా ప్రపంచంలో నిష్ణాతులైన డ్రోన్‌ నిపుణునిగా ఇండియాను నిలుపడం లక్ష్యంగా చేసుకున్నారు.

 
భారత ప్రధానికి ధన్యవాదములు తెలిపిన గరుడ ఏరోస్పేస్‌ సీఈవో అగ్నీశ్వర్‌ జయప్రకాష్‌ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమ బహిరంగ లేఖను అందజేశారు. ఆ లేఖలో అగ్నీశ్వర్‌ మాట్లాడుతూ, ‘‘గత 8 సంవత్సరాలుగా భారతదేశంలో నిశ్శబ్దంగా డ్రోన్‌ విప్లవం జరుగుతుంది. మన దేశంలో ప్రస్తుతం డ్రోన్స్‌ పర్యావరణ వ్యవస్ధ గణనీయంగా వృద్ధి చెందింది. మన చురుకైన విధానాలు దీనికి తోడ్పడుతున్నాయి. డ్రోన్ల పరంగా అంతర్జాతీయంగా అత్యుత్తమమైనవిగా నిలపాలనేది తమ విధానం. దాదాపు 10 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని ప్రయత్నిస్తున్నాను’’ అని అన్నారు.

 
ప్రస్తుతం 250 మిలియన్‌ డాలర్ల కంపెనీగా గుర్తింపు పొందిన గరుడ, భారతదేశంలో అత్యంత విలువైన డ్రోన్‌ స్టార్టప్‌గా గుర్తింపు పొందిన సంస్థ. భారతదేశపు మొట్టమొదటి డ్రోన్‌ యునికార్న్‌గా గుర్తింపు పొందింది. గరుడ ఫ్లీట్‌లో 300 డ్రోన్లు, 500 పైలెట్స్‌, 200 ముఖ్యమైన ఇంజినీర్లు 26 నగరాలలో కార్యకలాపాలలో నిమగ్నమయ్యారు. ఇది 30 విభిన్న రకాల డ్రోన్లు తయారుచేయడంతో పాటుగా 45 రకాల సేవలనూ అందిస్తున్నాయి.