సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 జూన్ 2024 (12:26 IST)

వడదెబ్బకు గురైన వానరం.. ఓఆర్ఎస్ ఇచ్చి కాపాడిన జనం (video)

monkey
ఘజియాబాద్‌లో వడదెబ్బకు గురైన వానరాన్ని కాపాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఘజియాబాదులోని ఓ ప్రాంతంలోని తీవ్రమైన ఉష్ణోగ్రతను తట్టుకోలేక చెట్టుపై నుండి నేలపై ఓ వానరం పడిపోయింది.
 
స్థానిక ప్రజలు వానరాన్ని మెల్లగా తట్టడం, చల్లటి నీటితో స్నానం చేయించారు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ పానీయం అందించడం ద్వారా వానరం మేల్కొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. 
 
మూగజీవిపట్ల మానవత్వాన్ని చాటిన స్థానికులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. యూపీలో ఈ తరహా ఘటన గతంలో కూదా చోటుచేసుకుంది. కొన్ని రోజుల కిందట బులంద్ షహర్ పట్టణంలో ఓ కోతి వడ్డదెబ్బకు గురైంది. చెట్టు నుంచి ఒక్కసారిగా పడిపోవడంతో అక్కడే ఉన్న వికాస్ తొమర్ అనే కానిస్టేబుల్ దాన్ని కాపాడాడు.