బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2022 (21:35 IST)

స్పాలో 15మంది వ్యక్తుల చేతిలో నలిగిపోయిన బాలిక.. రోజూ ఇదే తంతు..

rape
బీజేపీ పాలిత హర్యానాలోని స్పాలో బాలికను బెదిరించి ప్రతిరోజూ సుమారు 10 నుంచి 15 మంది వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు రెండోసారి ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్పందించారు. ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. 
 
సెక్టార్‌ 49 ప్రాంతంలో 14 ఏళ్ల బాలిక నివసిస్తుంది. ఈమెను పూజా అనే మహిళ ఒమాక్స్ గురుగ్రామ్ మాల్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఉన్న కింగ్‌ స్పాలో పనికి చేరింది. పూజా బంధువైన జుమా అనే మహిళ ఆ స్పాను నిర్వహిస్తుంది.
 
కాగా, ఆ స్పాలో చేరిన తొలి రోజు నుంచే తనపై లైంగిక వేధింపులు మొదలయ్యాయని ఆ బాలిక పోలీసులకు తెలిపింది. స్పాలోని ఒక గదిలోకి తనను బలవంతంగా పంపగా ఒక వ్యక్తి అత్యాచారం చేసినట్లు ఆరోపించింది.
 
దీంతో పని మానేస్తానని చెప్పగా రికార్డు చేసిన వీడియో చూపించి బెదిరించి బలవంతంగా పనిలో కొనసాగించారని ఫిర్యాదులో పేర్కొంది. ఐదు రోజుల పాటు బలవంతంగా ఆ స్పాలో పని చేశానని, ప్రతి రోజూ 10-15 మంది వ్యక్తులు తనపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపించింది.
 
పోలీసులు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. ఇంకా ఒక నిందితుడ్ని ప్రేమించినట్లు తనతో బలవంతంగా అబద్ధం చెప్పించారని ఆమె తెలిపింది.  
 
మైనర్‌ బాలిక ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. నిందితులైన స్పా నిర్వాహకురాలు జుమా, పూజ, రూబెల్, సద్దాంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసి నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీస్‌ అధికారి తెలిపారు.