ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (16:22 IST)

బాలికలకు మొబైల్ ఫోన్లు ఇవ్వద్దు.. అందుకే అత్యాచారాలు.. మీనా కుమారి

ఉత్తరప్రదేశ్ మహిళ కమిషన్ సభ్యురాలు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలికలకు వారి తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లు ఇవ్వదన్న ఆమె.. వీటి వల్ల అత్యాచారాలు పెరుగుతాయంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. అలీగఢ్ జిల్లాలో మహిళలపై వేధింపుల కేసులకు సంబంధించి విచారణ సందర్భంగా సభ్యురాలు మీనా కుమారీ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
''బాలికలకు మొబైల్ ఫోన్లు ఇవ్వద్దు. వారు అబ్బాయిలతో గంటల తరబడి మాట్లాడి ఆ తరువాత వారితో పారిపోతారు. వారి ఫోన్లను ఎవరూ చెక్ చేయరు.. కుటుంబసభ్యులకు ఈ వివరాలేవీ తెలియవు'' అని మీనా కుమారి అన్నారు. 
 
మహిళపై రోజు రోజుకూ వేధింపులు పెరుగుతుండటాన్ని సమాజం సీరియస్‌గా తీసుకోవాలని కూడా ఆమె సూచించారు. తల్లులకు వారి కూతుళ్ల పట్ల పెద్ద బాధ్యత ఉంటుందని, వారు నిరంతరం తమ కూతుళ్లను గమనిస్తూ ఉండాలని సూచించారు. అయితే.. కమిషన్ వైస్ చైర్‌పర్సన్ అంజూ చౌదరి మాత్రం ఈ కాంట్రవర్నీకి దూరంగా జరిగే ప్రయత్నం చేశారు. బాలికలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకపోవడమనేది లైంగిక దాడుల నిరోధించదని స్పష్టం చేశారు.