సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2020 (11:38 IST)

ప్రెజర్ కుక్కర్‌‌లో బంగారం.. కేరళ ఎయిర్‌పోర్టులో సీజ్ చేసిన పోలీసులు

Cooker
కేరళ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. జెడ్డా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి సుమారు 700 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు చెందిన అధికారులు అతన్ని పట్టుకున్నారు. ప్రెజర్ కుక్కర్‌లో బంగారాన్ని తీసుకు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 
 
కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జెడ్డా నుండి ఎస్జీ 9760 విమానంలో హమ్జా అనే ప్రయాణికుడు ఈ బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించాడు. ప్రెజర్ కుక్కర్ దిగువన ఉన్న ఒక ప్రత్యేక కంపార్ట్‌మెంట్‌లో బంగారం దాచబడింది. ఇక స్వాధీనం చేసుకున్న బంగారం మార్కెట్ విలువ సుమారు రూ .36 లక్షలు అని పోలీసులు తెలిపారు. 
 
విమానాశ్రయ ఇంటెలిజెన్స్ యూనిట్ డిప్యూటీ కమిషనర్ డా. ఐఎన్‌ఎస్ రాజి, సూపరింటెండెంట్లు సి గోకుల్‌దాస్, గణపతి పొట్టి, ఇన్‌స్పెక్టర్లు నరసింహ నాయక్, ప్రమోద్, ప్రణయ్ కుమార్, శివానీ, హెడ్ హవిల్దార్ చంద్రన్లతో కూడిన బృందం ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.