గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2020 (20:10 IST)

ఢిల్లీలోరూ.43 కోట్ల విలువ చేసే బంగారం స్వాధీనం.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?

ఢిల్లీలో స్మగ్లింగ్‌ చేస్తున్న బంగారం భారీగా పట్టుబడింది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రూ.43 కోట్ల విలువ చేసే బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డిఆర్‌ఐ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది మంది స్మగ్లర్ల నుంచి 504 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇవన్నీ 99.9 శాతం స్వచ్ఛమైనవని అధికారులు పేర్కొన్నారు. ఈ బంగారం బిస్కెట్లను మయన్మార్‌ నుంచి తీసుకొస్తున్నట్లు భావిస్తున్నామన్నారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు.