శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2022 (22:51 IST)

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌

money
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పబోతోంది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ భారీ బహుమతులు ఇవ్వబోతోంది. ఉద్యోగులకు త్వరలో డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంచనుంది. నేటి నుండి 18 రోజుల తర్వాత డీఏ పెంపు డబ్బులు వారి వారి బ్యాంకు అకౌంట్లో పడే అవకాశం ఉంది. 
 
మీడియా నివేదికల ప్రకారం, సెప్టెంబర్ 28న నవరాత్రులు ప్రారంభమైన రెండు రోజుల తర్వాత ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్ద ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. 
 
సెప్టెంబర్ 28న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపును ప్రకటించే అవకాశం ఉంది. గత మార్చి 2022లో కేంద్ర ఉద్యోగుల డీఏను ప్రభుత్వం పెంచింది. 
 
అప్పట్లో ఉద్యోగుల డీఏలో 3 శాతం పెంపు ఉండేది. దీంతో డీఏ 31 శాతం నుంచి 34 శాతానికి పెరిగింది. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు 34 శాతం చొప్పున డీఏ చెల్లిస్తున్నారు.