గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (10:50 IST)

వందకు పైగా భారతీయ భాషల్లో ఇంటర్నెట్ సెర్చ్ : సుందర్ పిచాయ్

Sundar Pichai
ప్రపంచంలో అత్యంత ప్రజాధారణ కలిగిన ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్. ఇందులో వందకు పైగా భారతీయ భాషల్లో వాయిస్, టెక్స్ట్ సెర్చ్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. గూగుల్ ఫర్ ఇండియా అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హస్తినకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో సాంకేతికంగా అద్భుతమైన మార్పులు వస్తున్నాయని చెప్పారు. దేశంలోని చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లకు గూగుల్ మద్దతిస్తుందని తెలిపారు. ప్రపంచంలో అధికంగా మాట్లాడే 100 భాషల్లో ఆన్‌లైన్ సెర్చ్‌కు అవకాశం కల్పించడంతో పాటు ప్రజలు తమ స్థానిక భాషలోనే విజ్ఞాన సముపార్జన, సమాచార సేకరణకు అవకాశం కల్పించాలన్న ప్రయత్నంలో భాగంగానే భారత్‌లో వందకు పైగా భాషల్లో సెర్చ్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకునిరానున్నట్టు చెప్పారు. వచ్చే 5-7 యేళ్లలో భారత్‌లో రూ.వెయ్యి కోట్ల డాలర్లు అంటే దాదాపు 75 వేల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు గత 2020లోనే గూగుల్ సంస్థ ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు.