సీపీఐ నేత గోవింద్ పన్సారే కన్నుమూత...!

govind pansare
CVR| Last Updated: శనివారం, 21 ఫిబ్రవరి 2015 (10:20 IST)
ప్రముఖ సీపీఐ నేత, టోల్ ఛార్జీల వసూళ్లకు వ్యతిరేక ఉద్యమకారుడు, గోవింద్ పన్సారే శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఆయన గత సోమవారం కోల్హాపూర్‌లో సతీమణి సౌమ పన్సారే‌తో కలిసి మార్నింగ్ వాక్‌కు వెళ్లి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు.

దుండగుల దాడిలో భార్య సౌమ పన్సారే శరీరంలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. తొలుత వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్‌లో శుక్రవారం సాయంత్రం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. పన్సారే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన సతీమణి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.దీనిపై మరింత చదవండి :