1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 15 జులై 2020 (09:14 IST)

రాజస్థాన్‌కు నూతన పీసీసీ చీఫ్.. కాంగ్రెస్ ఆఖరి అస్త్రం - కథ నడిపిస్తోంది బిజెపినే: అశోక్‌ గెహ్లాట్‌

రాజస్థాన్‌లో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. సచిన్‌ పైలట్‌కు ఉద్వాసన పలకడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌పై కాంగ్రెస్‌ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే విధంగా క్యాంపు రాజకీయాలు నడపడం, కాంగ్రెస్ అధినాయకులు సోనియగాంధి, రాహుల్ గాంధి, ప్రియాంక గాంధి, చిదంబరం వంటి వారు బుజ్జగించినా.. ఆయన వారి మాట వినకపోవడంతో ఆ పదవుల నుండి తప్పించింది.

అదే సమయంలో అన్ని మార్గాలు మూసుకుపోతుండడంతో కాంగ్రెస్ ఆఖరి అస్త్రం ప్రయోగించింది. ప్రజల్లో కొంత చరిష్మా వున్న, గెహ్లాట్ కి సన్నిహితుడైన గోవింద్ సింగ్ దొత్స్రా ను అంతేగాక రాజస్థాన్ నూతన పీసీసీ అధ్యక్షునిగా నియమించింది.
 
కథ నడిపిస్తోంది బిజెపినే: అశోక్‌ గెహ్లాట్‌
బిజెపి కుట్రలో భాగంగానే సచిన్‌ పైలెట్‌ దారి తప్పాడని, పైలెట్‌ చేతిలో ఏమీ లేదని, కథనంతా నడిపిస్తోందని బిజెపినేనని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. ఇదంతా బిజెపి కుట్ర అని అశోక్‌ గెహ్లోట్‌ ఆరోపించారు.

రెబల్‌ ఎమ్మెల్యేలకు బిజెపికి మధ్య అన్నీ డీల్స్‌ నిర్ణయించేశారని, వీరంతా కలిసి నేరుగా బిజెపిలో చేరుతారా లేక ప్రత్యేక పార్టీ పెట్టుకుంటారా అని కొద్ది రోజుల్లో తెలుస్తుందని అశోక్‌ గెహ్లోట్‌ అన్నారు.

అస్సలు పైలెట్‌ చేతిలో ఏమీ లేదని, రెబల్‌ ఎమ్మెల్యేలతో మాట్లాడుతుంది, బేరాలు కుదరుస్తుంది అంతా బిజెపినేని, రెబల్‌ ఎమ్మెల్యేలు ఉన్న రిసార్ట్‌ను ఏర్పాటు చేసింది కూడా బిజెపినేనని, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టిన బిజెపి బృందమే ఇక్కడ కూడా పని చేస్తోందని అశోక్‌ గెహ్లోట్‌ అన్నారు.

ప్రస్తుతం రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. సచిన్‌ పైలెట్‌ను ఉపముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్ష పదవి నుండి తప్పించారు. అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వానికి మద్దతిచ్చే వారి ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది.

నిన్నటి నుండి ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇద్దరు భారతీయ ట్రైబల్‌ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. సచిన్‌ పైలెట్‌ వద్ద 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబ్తున్నప్పటికీ ఉన్నది 20 మందేననేది సమాచారం.