సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 జులై 2022 (19:53 IST)

షాకిచ్చిన రైల్వే శాఖ - సీనియర్ సిటిజన్ల రాయితీకి మంగళం

train
భారతీయ రైల్వే శాఖ మరో షాకిచ్చింది. సీనియర్ సిటిజన్లకు కల్పిస్తూ వచ్చిన రాయితీకి మంగళంపాట పాడింది. రైల్వే టికెట్‌ ధరపై వృద్ధులకిచ్చే రాయితీని ఇకపై పునరుద్ధరించబోమని స్పష్టంచేసింది. 
 
కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో అన్ని రాయితీలనూ రద్దు చేసిన రైల్వే శాఖ.. కొన్నింటిని మాత్రమే పునరుద్ధరించింది. దీంతో వృద్ధులకిచ్చే రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్‌ ప్రయాణికుల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. 
 
గతంలో కొనసాగించిన అన్ని రాయితీలనూ తిరిగి పునరుద్ధరించే యోచన లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు టికెట్‌ రాయితీ గురించి అడిగిన ఓ ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ బుధవారం లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రాయితీల వల్ల రైల్వే శాఖపై మోయలేని భారం పడుతోందని పేర్కొన్నారు.