సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (09:41 IST)

వధువు చేయి పట్టుకుని ఏడు అడుగులు వేస్తుండగా గుండెపోటుతో వరుడు మృతి

marriage
మరికొన్ని క్షణాల్లో పూర్తికావాల్సిన పెళ్లి తంతులో అంతలోనే విషాదం చోటుచేసుకుంది. వధువుతో కలిసి ఏడు అడుగులు వేస్తున్న వరుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషాదకర ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సమీర్ ఉపాధ్యాయ (30) అనే దంత వైద్యుడికి శుక్రవారం వివాహం జరిపేందుకు ముహూర్తం నిర్వహించారు. ఇందుకోసం కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వరుడిన ఊరేగింపుగా వెళ్లి మండపం వద్దకు తీసుకొచ్చారు. ఆ తర్వాత వివాహ తంతు మొదలైంది. వధువుతో కలిసి ఏడుగులు వేస్తున్న సమయంలో సమీర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. 
 
దీంతో అప్పటివరకు బంధుమిత్రులు ఆనందోత్సవాల మధ్య కళకళలాడిన పెళ్లిమండంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. కుప్పకూలిన సమీర్‍‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారి. అయితే, అప్పటికే అతడు గుండెపోటుతో మరణించినట్టు నిర్ధారించారు. ఈ విషయం తెల్సిందే. బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.