శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2017 (12:10 IST)

గుజరాత్ ఎలక్షన్ రిజల్ట్స్ : ఖాతా తెరవని బీజేపీ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ మరోమారు అధికారాన్ని కేవసం చేసుకోవడం ఖాయమని తేలిపోయింది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ మరోమారు అధికారాన్ని కేవసం చేసుకోవడం ఖాయమని తేలిపోయింది. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత జిల్లాతో పాటు.. మరో ఐదు జిల్లాల్లో బీజేపీ ఖాతా తెరవలేదు. అలాగే, రెండు జిల్లాల్లో కాంగ్రెస్‌ కూడా ఖాతా తెరవలేదు. బీజేపీ ఖాతా తెరవని జిల్లాలు అమ్రేలీ, నర్మద, పోర్‌బందర్‌, ఆనంద్‌, డాంగ్స్‌, తాపి. కాగా కాంగ్రెస్‌ ఖాతా తెరవని జిల్లాలు నవ్‌పారి, అర్వలి. అలాగే, మోడీ సొంతవూరులో కూడా బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. బీజేపీ ఖాతా తెరవని ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
 
ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం కావడంతో ఈ ఎన్నికలను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలాగే, కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీ సామర్థ్యానికి ఈ ఫలితాలు మొదటి పరీక్షగా నిలవనున్నాయి. గుజరాత్‌లోని 182 స్థానాల్లో బీజేపీ 105, కాంగ్రెస్ 74 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
 
ముఖ్యంగా, ఉత్తర గుజరాత్‌లో బీజేపీ 32, కాంగ్రెస్‌ 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. సౌరాష్ట్రలో బీజేపీ 24, కాంగ్రెస్‌ 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..దక్షిణ గుజరాత్‌లో బీజేపీ 19, కాంగ్రెస్‌ 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తానికి చూస్తే ఎగ్జిట్‌ పోల్స్ అంచనా మరోమారు నిజం కానున్నాయి.