1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 జులై 2025 (10:42 IST)

గుజరాత్- మహిసాగర్ నదిపై గంభీర బ్రిడ్జీ కుప్పకూలింది.. ముగ్గురు మృతి (video)

Gujarat Bridge
Gujarat Bridge
గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో బుధవారం వంతెన కూలిపోవడంతో కనీసం ముగ్గురు మరణించగా, ఇంకా చాలా మంది నీటిలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అనేక వాహనాలు మహిసాగర్ నదిలో పడిపోయాయి. ఇంతలో, ఇప్పటివరకు నలుగురిని రక్షించామని, ఆపరేషన్ కొనసాగుతోందని పద్రా పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ చరణ్‌ తెలిపారు.
 
మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జీ ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కూలిపోయిందని అధికారి తెలిపారు. మహిసాగర్ నదిపై ఉన్న వంతెనలో ఒక భాగం కూలిపోవడంతో దాదాపు నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయి. రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు సహా వాహనాలు నదిలో పడిపోయాయి.