శనివారం, 18 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 అక్టోబరు 2025 (13:52 IST)

గుజరాత్ రాష్ట్ర మంత్రిగా రవీంద్ర జడేజా సతీమణి

rivaba jadeja
గుజరాత్ రాష్ట్ర మంత్రివర్గాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శుక్రవారం పునర్ వ్యవస్థీకరించారు. ఈ మంత్రివర్గ విస్తరణలో ఆయన భారత క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజాను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
 
గత కొంతకాలంగా గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో క్రియాశీలకంగా పని చేస్తున్న రివాబా... ఇపుడు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక భూమికను పోషించనున్నారు. భారత క్రికెట్ జట్టులో సభ్యుడుగా ఉన్న ఒక జాతీయ క్రికెటర్ సతీమణిని ఇపుడు ఓ రాష్ట్రమంత్రివర్గంలోకి తీసుకోవడం ఇపుడు ఆసక్తిగా మారింది.
 
రివాబా బడేజాకు మంత్రి పదవి దక్కడం పట్ల ఆమె మద్దతుదారులు, రవీంద్ర జడేజా అభిమానులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. క్రీడా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ మహిళ రాజకీయాల్లో రాణించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.