శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 22 మే 2018 (09:14 IST)

గుజరాత్‌లో దళితుడిని కొట్టి చంపిన ఫ్యాక్టరీ ఉద్యోగులు... (వీడియో)

గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. చెత్త ఏరుకునే వ్యక్తిని దొంగ అని భావించిన ఓ ఫ్యాక్టరీ ఉద్యోగులు కొట్టి చంపేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. చెత్త ఏరుకునే వ్యక్తిని దొంగ అని భావించిన ఓ ఫ్యాక్టరీ ఉద్యోగులు కొట్టి చంపేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో నివసిస్తున్న ముఖేష్ వనియా అనే వ్యక్తి చెత్త ఏరుకుంటూ జీవిస్తుండేవాడు. ఈనెల 20వ తేదీన భార్యతో కలిసి చెత్త ఏరుకుంటూ ఓ ఫ్యాక్టరీ వైపు వెళ్లాడు. అయితే ముఖేష్‌ని దొంగ అని భావించిన ఫ్యాక్టరీ ఉద్యోగులు.. తాడుతో చెట్టుకి కట్టేసి ఇనుప రాడ్లు, కర్రలతో అతడిని తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు ముఖేష్ చనిపోయాడు. 
 
ఆ తర్వాత తన భర్తను వెతుక్కుంటూ అక్కడకు వెళ్లిన భార్యపై కూడా వారు దాడి చేశారు. ఆమె కూడా తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు... ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి, ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. 
 
దీనిపై గుజరాత్ వడ్గమ్ ఎమ్మెల్యే, దళిత ఉద్యమ నేత జిగ్నేష్ మేవానీ స్పందిస్తూ, దళితులకు గుజరాత్ రాష్ట్రం సురక్షితం కాదని ఈ ఘటన వీడియోను పోస్ట్ చేశారు. 2016లో హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో జరిగిన దాడికంటే ఇది అత్యంత దారుణమైన ఘటనగా ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఇలాంటి ఘటనలు దేనికి సంకేతమంటూ బీజేపీ పాలకులను ప్రశ్నించారు.