శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2017 (10:05 IST)

16 చోట్ల బొటాబొటీ మెజార్టీతో గట్టెక్కిన బీజేపీ అభ్యర్థులు

దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించిన గుజరాత్ ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయభేరీ మోగించినప్పటికీ.. కమలనాథులకు ఏమాత్రం సంతృప్తినివ్వలేదు.

దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించిన గుజరాత్ ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయభేరీ మోగించినప్పటికీ.. కమలనాథులకు ఏమాత్రం సంతృప్తినివ్వలేదు. కారణం 182 సీట్లకుగాను 99 సీట్లు మాత్రమే గెలుచుకున్నాయి. అందులో 16 చోట్ల బీజేపీ అభ్యర్థులు బొటాబొటీ మెజార్టీతో గట్టెక్కారు. గోద్రా అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి కేవలం 258 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇలాగే, చాలా చోట్ల అభ్యర్థులు వందల నుంచి 2 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 
 
నిజానికి గుజరాత్‌లో గత 22 యేళ్లుగా సాగుతున్న బీజేపీ పాలనకు చరమగీతం పాడాలన్న ఏకైక లక్ష్యంతో, కాంగ్రెస్ పార్టీ శాయశక్తులా ప్రయత్నించినా, విజయానికి మాత్రం దగ్గర కాలేకపోయింది. చాలా నియోజకవర్గాల్లో పోటీ హోరాహోరీగా సాగింది. ఎన్సీపీ, బీఎస్పీ పార్టీలతో పాటు, స్వతంత్రంగా పోటీ చేసిన అభ్యర్థులు, ప్రధాన పార్టీ అభ్యర్థుల ఓట్లకు గండి కొట్టారు. 
 
గోద్రాలో బీజేపీ అభ్యర్థి కేవలం 258 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించాడు. ఇక్కడ నోటా (నన్ ఆఫ్ ది ఎబౌ)కు 3,050 ఓట్లు, ఇండిపెండెంట్‌కు 18 వేల ఓట్లు వచ్చాయి. విజాపూర్, మన్సా, దేంగ్స్, దేవధర్ తదితర ఎనిమిది స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు 2 వేల కన్నా తక్కువ ఓట్ల మార్జిన్‌తో ఒడ్డున పడ్డారు. ఇక ఈ నియోజకవర్గాల్లో ఇంకాస్త కృషి చేసి ఉంటే, ఫలితం తమకు అనుకూలంగా వచ్చి ఉండేదని ఓడిపోయిన వారు చర్చించుకుంటున్నారు.