శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2017 (09:18 IST)

నా భార్య డేరా బాబాకు భార్యగా ఉంది : హనీ ప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా

నా భార్య డేరా బాబాకు భార్యగా ఉందంటూ హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా అంటున్నారు. ఇద్దరు సాధ్వీల అత్యాచారం కేసులో డేరా చీఫ్ గుర్మీర్ రాం రహీం బాబాకు 20 యేళ్ల జైలుశిక్ష పడిన విషయం తెల్సిందే. డేరా బాబ

నా భార్య డేరా బాబాకు భార్యగా ఉందంటూ హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా అంటున్నారు. ఇద్దరు సాధ్వీల అత్యాచారం కేసులో డేరా చీఫ్ గుర్మీర్ రాం రహీం బాబాకు 20 యేళ్ల జైలుశిక్ష పడిన విషయం తెల్సిందే. డేరా బాబా జైలుకెళ్లిన తర్వాత ఆయన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో డేరా బాబా దత్తపుత్రికగా భావిస్తున్న హనీప్రీతి ఇన్సాన్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా ఇంతకాలం తన మససులో దాచిపెట్టుకున్న విషయాలను బహిర్గతం చేశాడు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో ఆయన మాట్లాడుతూ, 1999లో హనీప్రీత్‌తో తన వివాహం జరిగిందన్నారు. 2011లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నానన్నారు. హనీప్రీత్ డేరాబాబా దత్తపుత్రిక కాదని, అతనితో ఆమె ఏకాంతంగా గడుపుతుండగా తాను కళ్లారా చూశానని చెప్పారు. అందుకే తనను చంపేస్తామని చాలా సార్లు బెదిరించారన్నారు. 
 
డేరాబాబా తన నివాస ప్రాంగణంలోని రహస్య గుహలాంటి చోట ‘బిగ్‌‌బాస్‌’ తరహా కార్యక్రమం నిర్వహించేవాడని ఆయన తెలిపారు. అందులో పాల్గొనేందుకు కేవలం జంటలను మాత్రమే ఎంపిక చేసేవాడని ఆయన చెప్పారు. ఆరు జంటలతో 28 రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగేదని వెల్లడించారు.