Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దత్తపుత్రిక కాదు.. అపుడు నా భార్య... ఇపుడు డేరా బాబా ఉంపుడుగత్తె

శనివారం, 2 సెప్టెంబరు 2017 (06:03 IST)

Widgets Magazine

డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా దత్తపుత్రికగా పేర్కొంటున్న హనీప్రీత్ ఇన్సాన్‌ గురించి ఓ ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆమె డేరా బాబా దత్తపుత్రిక కాదనీ, విశ్వాస్ గుప్తా అనే వ్యక్తి మాజీ భార్య అని తేలింది. పైగా, హనీప్రీత్ ఇన్సాన్ అసలు పేరు పింకీ తనేజా. డేరా సచ్చా సౌధాకు వెళ్లే భక్తుల్లో విశ్వాస్ గుప్తా ఫ్యామిలీ కూడా ఒకటి. అలా పింకీ తనేజాపై కన్నేసిన డేరా బాబా ఆమెను వశపరుచుకుని తన ఉంపుడుగత్తెగా ఉంచుకున్నాడు.
dera baba - honypreet
 
నిజానికి హనీప్రీత్ ఇన్సాన్.... ఈ పేరు పెద్దగా జనానికి తెలియకపోవచ్చు. కానీ డేరా బాబా దత్తపుత్రికగా చాలా ఫేమస్. డేరా బాబా జైలు పాలు కావడంతో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ దత్తపుత్రిక అరాచాకాలు వెలుగులోకి వస్తున్నాయి. పేరుకే దత్త పుత్రిక. కానీ డేరాబాబాతో అక్రమ సంబంధం ఉందని ఆమె భర్తే ఆరోపిస్తున్నాడు. 
 
డేరాబాబా తర్వాత ఆశ్రమంలో హనీప్రీత్ మాటే చెల్లుబాటు అవుతుంది. ఆమెను బాబా అనధికారిక వారసురాలిగా తన వెంటే తిప్పుకునే వాడు. అంతేకాదు డేరా బాబా తీసిన సినిమాలన్నింటికి హనీయే డైరెక్టర్. అనుక్షణం డేరాబాబా వెంటే ఉన్న హనీప్రీత్ నేరం రుజువై పోలీసులు అరెస్టు చేసినప్పుడు కూడా హనీప్రీత్ ఆయన వెంటే ఉన్నారు. ఇపుడు ఈ దత్తపుత్రిక చిక్కుల్లో పడిపోయింది. డేరా బాబా అరెస్టైన వెంటనే అతన్ని జైలు నుంచి తప్పించేందుకు పన్నిన కుట్రలో హనీప్రీత్ కూడా భాగస్వామిగా తేలడంతో హ‌ర్యానా పోలీసులు.. హ‌నీప్రీత్‌పై లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు.
 
డేరా చీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ ను జైలుకు తరలించే సమయంలో ఆయన చేతిలో ఎర్రబ్యాగు చూపిస్తే ఆయన్ను తప్పించాలనేది  డేరా గ్యాంగ్ కుట్ర. అయితే కుట్రలో ద‌త్త పుత్రిక హ‌నీప్రీత్ ప్రధాన పాత్రధారి అని తెలుసుకున్న పోలీసులు ఆమె‌పై కేసు నమోదు చేశారు. హ‌నీప్రీత్‌తో పాటు గుర్మీత్ ముఖ్య అనుచ‌రుల కోసం పోలీసుల బృందాలు గాలిస్తున్నాయి. దేశంలోని ప్రముఖ విమానాశ్రయాలకు హనీప్రీత్‌కు సంబంధించిన సమాచారం పంపి ఆమె కదలికలపై నిఘా పెట్టారు. దేశం విడిచిపెట్టి పారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఒంటరిగా వల్లకాదు చంపమంటున్న డేరా బాబా... నేపాల్‌కు పారిపోయిన హనీ?

డేరా బాబాకు జైలు శిక్ష పడిన తర్వాత అతడిని తప్పించేందుకు ఆయన దత్త పుత్రిక హనీ ప్రీత్ ...

news

ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రాధాన్యం... అర్చకులకు 'చంద్రన్న బీమా'

అమరావతి : రాష్ట్రంలోని దేవాలయాలకు వస్తున్న భక్తులు, యాత్రికులను దృష్టిలో పెట్టుకుని తగు ...

news

కలెక్టర్ అమ్రపాలి ఐఏఎస్ పరీక్షా టిప్స్... (Video)

తెలంగాణా రాష్ట్రంలో పని చేస్తున్న జిల్లా కలెక్టర్లలో అమ్రపాలి ఒకరు. వరంగల్ అర్బన్ జిల్లా ...

news

3,323 డీలర్ల పోస్టుల భర్తీ... వేలి ముద్రలు పడకపోయినా సరుకులివ్వండి... మంత్రి పత్తిపాటి

అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3,323 డీలర్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు ...