మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2019 (13:24 IST)

షాపింగ్ మాల్‌లో ఆ రాకెట్- స్పా సెంటర్‌ ముసుగులో.. 17 మంది యువతుల అరెస్ట్!

గుర్‌గ్రామ్‌లోని షాపింగ్ మాల్‌లో సెక్స్ రాకెట్ బయటపడింది. షాపిగ్ మాల్‌లో ఓ స్పా సెంటర్‌లో పోలీసులు దాడి చేయడం ద్వారా ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. 


ఈ సందర్భంగా 17మంది అమ్మాయిలతో పాటు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్పా సెంటర్ మేనేజర్‌ను కూడా అరెస్ట్ చేశారు. పాలమ్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్పా సెంటర్ పేరుతో సెక్స్ రాకెట్ నడుస్తుందని పోలీసులకు అజ్ఞాత వ్యక్తి సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించారు.

పక్కా సమాచారం ప్రకారం దాడి చేశారు. ఆ సమయంలో అక్కడున్న అమ్మాయిలు, విటులతో పాటు స్పా సెంటర్ మేనేజర్‌ని కూడా అరెస్ట్ చేశారు. 
 
మరో పార్టనర్ గౌరవ్ ఖరే అనే వ్యక్తి అక్కడ లేకపోవడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టు చేసిన యువతులు ఢిల్లీ, తమిళనాడు, మిజోరం, మణిపూర్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, తెలంగాణకు చెందినవారిగా గుర్తించారు.