శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 16 జూన్ 2019 (10:44 IST)

బీహార్‌లో మరణమృదంగం... మెదడు వాపుతో 97 మంది చిన్నారులు మృతి

బీహార్‌లో మరణమృదంగం మోగుతోంది. మెదడువాపు వ్యాధికి అనేక మంది చిన్నారులు మృత్యువాతపడతున్నారు. ఇప్పటికే 97 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రంగంలోకి దిగారు. 
 
ఈ ప్రాణాంతకమైన ఈ వ్యాధి బారినపడి చనిపోయిన వారి సంఖ్య 97కు చేరగా, ఒక్క ముజఫర్‌పూర్‌లోనే మృతుల సంఖ్య 84గా ఉంది. వైశాలీ ఆసుపత్రిలో 10 మంది, మోతిహారీ ఆసుపత్రిలో ఒకరు, బెగూసరాయ్ ఆసుపత్రిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారని అధికారులు వెల్లడించారు. కాగా, శుక్రవారం నాడు 57గా ఉన్న మృతుల సంఖ్య 24 గంటల్లోనే పెరిగిపోయింది.
 
ఆసుపత్రుల్లో చికిత్స నిమిత్తం చేరిన చిన్నారులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని, ప్రాణనష్టం పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య మంత్రి హర్ష వర్ధన్ అధికారులను ఆదేశించారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న ముజఫర్‌పూర్‌ను తాను సందర్శిస్తానని ఆయన అన్నారు.