సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (15:48 IST)

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత: కాల్పులు, టియర్ గ్యాస్ ప్రయోగం

Manipur
మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతగా మారింది. మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలో భద్రతా బలగాలు, సాయుధ వ్యక్తుల మధ్య తాజాగా కాల్పులు జరిగాయి. బిష్ణుపూర్ జిల్లాలోని ఫౌగాక్ చావో ఇఖాయ్‌లో వేలాదిమంది నిరసనకారులు గుమికూడారు. 
 
టోర్‌బంగ్‌లోని వారి నిర్జన గృహాలకు చేరుకునే ప్రయత్నంలో ఆర్మీ బారికేడ్‌లను ఛేదించడానికి ప్రయత్నించారు. దీంతో శుక్రవారం కాల్పుల సంఘటన జరిగింది. 
 
ఇంకా పరిస్థితిని అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. మే 3వ తేదీన మణిపూర్‌లో జాతి హింస చెలరేగడంతో 160 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.