శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Modified: సోమవారం, 2 మార్చి 2015 (17:13 IST)

జమ్మూ కాశ్మీర్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు

జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఎడతెరపి లేకుండా మంచు కురుస్తోంది. జనజీవనానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. రహదారులు అన్నీ మంచుతో కప్పివేయబడ్డాయి. వివరాలిలా ఉన్నాయి.
 
హిమాలయ పర్వత పంక్తులకు కింది భాగంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో హిమపాతం ఎక్కవైంది. కొద్ది కాలంగా మంచు విపరీతంగా కురుస్తోంది. భారతదేశంలో భూమధ్య రేఖకు కింది దక్షిణ ప్రాంతంలో ఎండలు రోజు రోజుకు పెరుగుతుంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో హిమపాతం పెరగడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇందులో భాగంగా జమ్మూ, కాశ్మీర్ హైవేను మూసేశారు.
 
జమ్మూ కాశ్మీర్ లోని వివిధ ప్రాంతాలలో రోడ్లపై కనీసం రెండడగులు మేర మంచు కురిసింది. పేరుకుపోయిన మంచుతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో ట్రాఫిక్ సమస్య నెలకొంది. కొన్ని ప్రాంతాలలో తక్కువ హిమపాతం ఉన్నప్పటికీ వాహనాలు రోడ్డుపై జారిపోతున్నాయి. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.