శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (13:35 IST)

'మహాత్మా గాంధీ'ని తుపాకీతో కాల్చిన ఝాన్సీ అరెస్టు

జాతిపిత వర్థంతి రోజున మహాత్మా గాంధీ గడ్డి బొమ్మను తుపాకీతో కాల్చిన అఖిల భారత మహాసభ నాయకురాలు పూజా పాండేను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు భర్త అశోక్ పాండేలను కూడా పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. 
 
గాంధీ 71వ వర్థంతి వేడుకల రోజున హంతకుడు గాడ్సే మాతృసంస్థ హిందూ మహాసభ ఆధ్వర్యంలో గాడ్సే మహావీరుడుగా పేర్కొంటూ ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పూజా పాండేతో పాటు అశోక్ పాండేలు మరికొంతమంది హిందూ మహాసభ కార్యకర్తలు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గడ్డి బొమ్మను ఆ సంస్థ సభ్యులందరూ హర్షధ్వానాలు చేస్తుండగా.. హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి పూజా శకున్‌ పాండే.. గాంధీజీ గడ్డిబొమ్మపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఆ తర్వాత గాంధీకి వ్యతిరేకంగా, గాడ్సేకు అనుకూలంగా నినాదాలు చేశారు. 
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై యూపీ పోలీసులు కేసు నమోదు చేయడంతో పూజా పాండేతో పాటు ఆమె భర్త పారిపోయారు. వారి కోసం గాలించిన పోలీసులు.. ఎట్టకేలకు అరెస్టు చేశారు.