Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డేరా బాబా మట్టిపని చేస్తున్నారు.. జీతం రూ.20.. డేరా ఆస్తులు వేలం?

బుధవారం, 27 సెప్టెంబరు 2017 (19:50 IST)

Widgets Magazine

డేరా బాబా గుర్మీత్ సింగ్ అత్యాచార కేసుల్లో జైలు జీవితం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. డేరాబాబాను దోషిగా ప్రకటించాక పంచకుల సహా చాలా ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. దీంతో వందలాది కోట్ల ఆస్తి నష్టం జరిగింది. దీనికి పరిహారం చెల్లించాలంటూ డేరా సచ్ఛ సౌధాను న్యాయస్థానం ఆదేశించింది. ఈ డబ్బును డేరా వారసలు కట్టకపోతే డేరా సచ్ఛ సౌధా ఆస్తులను వేలం వేయనుంది.
 
అలాగే డేరా బాబా ఆర్థిక వ్యవహారాలపై లెక్క తేల్చాలని ఆదాయ శాఖ, ఈడీని హర్యానా, పంజాబ్ కోర్టు ఆదేశించింది. దీంతో ఐటీ, ఈడీ రంగంలోకి దిగింది. సిర్సాలో డేరా ఆస్తుల విలువ రూ.1453 కోట్లని హర్యానా ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు హైకోర్టుకు ఆఫిడవిట్ సమర్పించింది.
 
మరోవైపు.. మహిళలపై అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రోహ్‌తక్ జైలులో ఉన్నారు. అందరు ఖైదీల్లాగానే జైల్లో కూలి పని చేస్తున్నారు. రోజుకు రూ.20 కూలి ఇస్తున్నారు. ప్రతిరోజు డేరాబాబా మట్టి పనిచేస్తున్నారు. రోజుకు నాలుగు నుంచి ఐదు గంటల సేపు పనిచేస్తున్నారు. 
 
అందరి ఖైదీల్లాగానే ఆయనకూ అదే ఆహారాన్ని అందిస్తున్నారు. వార్తాపత్రికలు, టీవీని కూడా ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా హనీప్రీత్‌కు సంబంధించిన సమాచారం ఆయనకు అందడం లేదు. దీంతో రాత్రిపూట హనీప్రీత్ సింగ్‌నే కలవరిస్తున్నాడట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సినిమా హాళ్లల్లో విరామ సమయంలో షార్ట్ ఫిల్మ్‌లు

చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే విధించే శిక్షల గురించి షార్ట్‌ఫిల్మ్‌లను సినిమా ...

news

జగన్‌ అనవసరంగా కలలు కంటున్నారు: డిప్యూటీ సీఎం

రెవిన్యూ ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావాలన్నారు ఉప ...

news

ఏసీబీకి చిక్కిన అవినీతి చేపలను కఠినంగా శిక్షించాలి - సీపీఐ నేత రామకృష్ణ

అక్రమాస్తులు సంపాదించి ఎసిబికి దొరికిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సిపిఐ ...

news

తాగొస్తే చీపురు తిరగెయ్యండి...రోజా

ఎమ్మెల్యే.. అమ్మా.. మా భర్తలు తాగొచ్చి ఇళ్ళు గుళ్ళ చేస్తున్నారమ్మా.. పనిచేసిన డబ్బును ...

Widgets Magazine