మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 మే 2023 (13:51 IST)

రూ. 2 వేల నోటును ఎలా మార్చుకోవాలి.. తెలుసుకుందాం..

రూ.2వేల నోట్లను ఉపసంహరించుకోవచ్చునని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ దగ్గర వున్న రెండువేల నోట్లను ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. ప్రజలు తమ దగ్గర ఉన్న 2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు. 
 
దీనికి తగిన డబ్బును రూ.500, రూ.100 నోట్ల కింద మీకు తిరిగి చెల్లిస్తారు. బ్యాంకుల్లో రెండు వేల నోట్లను మీ అకౌంట్‌లో డిపాజిట్ చేసుకోవచ్చు. రోజుకు రూ.20వేల రూపాయలను మాత్రమే డిపాజిట్ చేయాలి. 
 
అంటే పది నోట్లను మాత్రమేనని.. పది 2వేల రూపాయల నోట్లను మీ బ్యాంక్‌ అకౌంట్‌లో డిపాజిట్ చేసే అవకాశం వుంది. ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్లు లేనట్లైతే.. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ మార్చుకోవచ్చు.