కుక్క మాంసానికి భారీ డిమాండ్.. ఎక్కడ?
స్టార్ హోటళ్లలో మటన్‌కు బదులు కుక్క మాంసాన్ని వడ్డిస్తున్నారనే వార్తలు గతంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా ఈ చర్చ మరోసారి తెరమీదకి వచ్చింది. త్రిపుర-మిజోరాం సరిహద్దులో జరిగిన ఘటనే ఇందుకు కారణం.
త్రిపుర - మిజోరాం సరిహద్దు వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. త్రిపుర నుంచి మిజోరాంకు వీధి కుక్కలను తరలిస్తున్నట్లు తెలిపారు.
మిజోరాంలో కుక్క మాంసానికి భారీ డిమాండ్ ఉండటంతో త్రిపుర నుంచి అక్కడికి శునకాలను తరలిస్తున్నట్లు వెల్లడించారు. అక్కడ ఒక్కో శునకాన్ని రూ. 2000-2500 వరకు పెట్టి కొనుకుంటారని వారు పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.