ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కొద్దిరోజులకే కట్నం తేవాలన్నాడు.. భార్య?

Last Updated: సోమవారం, 15 జులై 2019 (20:03 IST)
ప్రేమించి వివాహం చేసుకుని.. భార్యను చిత్ర హింసలకు గురిచేశాడు. చివరికి వేధింపులు తాళలేక ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ జిల్లాకు చెందిన షోయబ్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన మిస్బా అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు మధ్య కొద్ది రోజుల్లోనే విబేధాలు తలెత్తాయి. ఈ మనస్పర్ధల కారణంగా ప్రేమించి వివాహం చేసుకున్న భార్యను భర్త చిత్ర హింసలకు గురిచేశాడు. 
 
వరకట్నం కోసం వేధించడం మొదలెట్టాడు. దీంతో పుట్టింటికి వెళ్లిపోయిన మిస్బా.. భర్త హింసలను తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు షోయబ్‌‍ను అరెస్ట్ చేశారు. పేరుతో వివాహం చేసుకుని వరకట్నం కోసం వేధింపులకు గురిచేసిన షోయబ్‌ను కఠినంగా శిక్షించాలని మిస్బా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :