శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2017 (16:29 IST)

పట్టపగలే.. భార్యపై కత్తితో వేటు వేసిన భర్త.. (వీడియో)

మహిళలకు దేశంలో భద్రత కరువైంది. అత్యాచారాలు, గృహహింసలు, వేధింపులు ఇలా రోజూ ఏదో రూపంలో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇన్నాళ్లు కట్టుకున్న భార్యలను ఇంటిలోపలే వేధించే దుండగులు.. ప్రస్తుతం పబ్లిక్‌ రో

మహిళలకు దేశంలో భద్రత కరువైంది. అత్యాచారాలు, గృహహింసలు, వేధింపులు ఇలా రోజూ ఏదో రూపంలో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇన్నాళ్లు కట్టుకున్న భార్యలను ఇంటిలోపలే వేధించే దుండగులు.. ప్రస్తుతం పబ్లిక్‌ రోడ్డుపైకి వచ్చి భార్యలను హింసిస్తున్నారు. అలాంటి ఘటనే పుణేలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే పూణేలో పట్టపగలు భార్యపై ఓ కిరాతకుడు హత్యయత్నం చేశాడు. చుట్టుపక్కల అందరూ చూస్తుండగానే భార్యను కత్తితో వేటు వేశాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. ఆ తరువాత పోలీసులకు ఫోన్‌ చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కత్తితో భార్యపై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. 
 
పుణేలో ఉంటున్న ఫిరోజ్‌ అలీ, పటానా ఇద్దరు భార్యాభర్తలు. అయితే ఒక్కసారిగా భార్యపై ఫిరోజ్ అలీ హత్యాయత్నం ఎందుకు చేశాడనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాధితురాలైన మహిళకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.