కుమారుడు ఫ్రెండ్‌తో భార్య సరసం - ఒంటిపై నూలుపోగు లేకుండా చూసిన భర్త..

murderer
ఠాగూర్| Last Updated: ఆదివారం, 9 ఆగస్టు 2020 (16:35 IST)
కామంతో మదమెక్కిన కొందరు మహిళలు తమ బిడ్డల వయస్సున్న యువకులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి సంబంధాలు చివరకు హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా తమిళనాడులో ఓ వివాహేతర హత్య జరిగింది. తన కుమారుడి స్నేహితుడితో ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ కుర్రోడితో భార్య పడక గదిలో ఏకాంతంగా ఒంటిపై నూలుపోగులేకుండా ఉండటాన్ని చూసిన భర్త.. ఆగ్రహంతో రగిలిపోయి కత్తితో పొడిచి చంపేశాడు.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్ పట్టణం, ఆచారిపల్లెంకు చెందిన దంపతులకు 19 యేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇంటి యజమాని వడ్రంగి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఈ క్రమంలో జల్సాలకు అలవాటుపడిన భార్య... తమ ఇంటికి వచ్చే కుమారుడు స్నేహితుడిపై మనసుపడింది. ఈ క్రమంలో ఆ కుర్రోడిని లైన్లో పెట్టి, ఎవరికీ అనుమానం రాకుండా శారీరకసుఖం పొందుతూ వచ్చింది. ఈ క్రమంలో తన కోర్కెలు తీర్చుకునేందుకు ఆ కుర్రోడి ఖర్చులకు డబ్బులు ఇస్తూ... మరింతగా ప్రోత్సహిస్తూ పడక సుఖం పొందసాగింది.

అయితే, ఇరుగుపొరుగువారికి సందేహం వచ్చింది. ఆ కుర్రోడు సమయం సందర్భం లేకుండా ఇంటికి వచ్చి వెళ్లడాన్ని గమనించి, ఆ మహిళ భర్త దృష్టికి తీసుకెళ్లారు. ఓ రోజు పని మీద బయటకు వెళ్లిన భర్త ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో పడక గదిలో బెడ్‌పై భార్య ఒంటిపై నూలుపోగు లేకుండా ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తుండటం చూసి నిర్ఘాంతపోయాడు.

అలా భార్యను చూడగానే భర్తకు కోపం కట్టలు తెంచుకుంది. అంతే.. ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. దీన్ని చూసిన ప్రియుడు ప్రాణభయంతో నగ్నంగానే పరుగులు తీశాడు. అనంతరం నిందితుడు నేరుగా స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.దీనిపై మరింత చదవండి :