గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (22:45 IST)

వరకట్నం వేధింపులు.. ఫిర్యాదు.. అంతే తొలిరాత్రి వీడియోను?

woman
మధ్యప్రదేశ్‌లో ఓ భర్త కట్నం కోసం భార్యను బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని మచ్లీ మండికి చెందిన 27 ఏళ్ల యువకుడికి, యువతికి రెండేళ్ల క్రితం వివాహమైంది. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న యువకుడు తన భార్యను తరుచూ కట్నం అడగుతూ ఇబ్బంది పెట్టాడు. 
 
అంతేగాకుండా భార్యను తరచూ కొట్టి వేధించడం సాగాడు. దీంతో ఆ యువతి తన తల్లి ఇంటికి వెళ్లి భర్తపై వరకట్న ఫిర్యాదు చేసింది. కానీ వరకట్నం ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఆమెను భర్త బెదిరించాడు. 
 
అయితే సదరు యువతి అందుకు నిరాకరించడంతో ఆవేశానికి గురైన ఆమె భర్త.. తొలిరాత్రికి సంబంధించిన వీడియోను సోషల్ నెట్ వర్క్‌లో పోస్ట్ చేశాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తను అరెస్టు చేశారు. విచారణలో వివాహమైనప్పటి నుంచి భార్యతో  కలిసి చేసే ప్రతీ పనిని వీడియో తీసినట్లు విచారణలో తేలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.