1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2016 (11:29 IST)

మమ్నల్ని ఉరి తీయండి.. జరిమానాను కొత్త నోట్లతో కట్టాలా? పాత నోట్లతో కట్టాలా?

దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో పేలుళ్లకు పాల్పడిన కేసులో యాసిన్, జియా ఉర్ రెహమాన్ అలియాస్ వకాస్, అసదుల్లా అక్తర్, అజజ్ షేక్, తహసీన్ అక్తర్‌లకు సోమవారం ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే

దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో పేలుళ్లకు పాల్పడిన కేసులో యాసిన్, జియా ఉర్ రెహమాన్ అలియాస్ వకాస్, అసదుల్లా అక్తర్, అజజ్ షేక్, తహసీన్ అక్తర్‌లకు సోమవారం ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. నిందితులు పాల్పడ్డ చర్య చాలా తీవ్రమైనదని కోర్టు తీర్పులో అభిప్రాయం వ్యక్తం చేసింది. 
 
సోమవారం కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో 'మీరేమైనా చెప్పదల్చుకున్నారా?' అని దోషులను కోర్టు ప్రశ్నించింది. దీనికి 'మమ్మల్ని ఉరి తీయండి' అంటూ ఆ ఉగ్ర నిందితులు బదులిచ్చారు. కాగా, న్యాయమూర్తి.. పేలుళ్ల దోషులు ఐదుగురికి కూడా ఉరిశిక్షతోపాటు జరిమానా విధించారు. 
 
ఈ సందర్భంగా దోషులైన ఉగ్రవాదులు కోర్టులో దుస్సాహసానికి పాల్పడ్డారు. తమకు విధించిన జరిమానాను రద్దయిన నోట్లతో చెల్లించాలా? లేక కొత్త నోట్లే చెల్లించాలా? అంటూ పేలుళ్ల కేసులో దోషులైన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు యాసిన్ భత్కల్ తోపాటు ఇతర ఉగ్రవాదులు.. న్యాయమూర్తిని అడిగారు.
 
కాగా, రియాజ్ భక్తల్ తోపాటు ఈ ఐదుగురు ఫిబ్రవరి 21, 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్లలో 19మంది మరణించగా, 131మందికిపైగా గాయాలయ్యాయి. కాగా, రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. అతను పాకిస్థాన్‌లో ఉన్నట్లుగా ఎన్ఐఏ అనుమానిస్తోంది.