రాహుల్ యాత్ర ఎఫెక్ట్ : హైదారాబాద్‌లో స్కూల్స్‌కు సెలవు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్త పాదయాత్రను కొనసాగిస్తున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో ఆయన ఈ పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఇది తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ యాత్ర కారణంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
ముఖ్యంగా, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, బానానగర్, బోయిన్‌పల్లి తదిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. దీనికి కారణం లేకపోలేదు. రాహుల్ భారత్ జోడో యాత్ర కారణంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మార్పులు చేశారు. అనేక ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించారు. ఈ కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశ్యంతో స్కూల్స్‌కు సెలవులు ఇచ్చారు.
ఇదిలావుంటే, ఈ యాత్ర బుధవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అంతేకాకుండా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా నగర వాసులకు ఓ విన్నపం చేశారు. బోయిన్‌పల్లి, బాలా నగర్, వై జంక్షన్, జేఎన్టీయూ, చాంద్ నగర్ ప్రాంతాలకు వెళ్లకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు.