శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (10:55 IST)

'ఏ ఫర్ అమ్మ.. బి ఫర్ బాయ్'... బెంగుళూరు జైలులో చిన్నమ్మ అంగ్ల పాఠాలు

అక్రమాస్తుల కేసులో శిక్షపడి బెంగుళూరు జైలులో ఉంటున్న శశికళ ఆంగ్ల పాఠాలు నేర్చుకుంటుందట. ఏ ఫర్ అమ్మ (జయలలిత), బి ఫర్ బాయ్ (దినకరన్) అంటూ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సును చదువుతుందట.

అక్రమాస్తుల కేసులో శిక్షపడి బెంగుళూరు జైలులో ఉంటున్న శశికళ ఆంగ్ల పాఠాలు నేర్చుకుంటుందట. ఏ ఫర్ అమ్మ (జయలలిత), బి ఫర్ బాయ్ (దినకరన్) అంటూ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సును చదువుతుందట. ఇందుకోసం ఆంగ్లం అక్షరమాల పుస్తకాలు కూడా కొనుకున్నట్టు సమాచారం. ఆంగ్లం నేర్చుకోవాలని ఉందని ఆమె జైలు అధికారులకు చెప్పడంతో వారు కూడా సమ్మతించినట్టు చెప్పారు. 
 
మరోవైపు... శశికళ జైలులో ఆత్మకథ రాసే పనిలో కూడా ఉన్నారు. శశికళకు తమిళం మినహా ఇతరభాషలు రావు. ముఖ్యంగా.. ఆంగ్లం ఒక్క అక్షరం కూడా తెలియదు. అందుకే జైలులో ఇంగ్లీష్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతోంది. జైలు అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.
 
కాగా, జయలలిత మృతి అనంతరం శశికళ 'అమ్మ'ను అనుసరించే ప్రయత్నాలు చేశారు. జయలలితలా వేషధారణ, హెయిర్ స్టయిల్, విక్టరీ సింబల్.. ఇలా చిన్నమ్మను అనుసరించే ప్రయత్నాలు చేశారు. అంతలోనే కాలం కలిసిరాక జైలుకు వెళ్లారు.