సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (19:06 IST)

ధ్వని వేగానికి మంచిన వేగంతో సూపర్ సోనిక్ మిస్సైల్ టెస్ట్ సక్సెస్

BrahMos Missile
భారత్ రష్యా దేశాలు కలిసి అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ మిస్సైల్‌ను రక్షణ శాఖ పరీక్షించింది. ధ్వని వేగాన్ని మించిన వేగంతో దూసుకెళ్లే ఈ సూపర్ సోనిక్ మిస్సైల్ పరీక్ష విజయవంతమైందిది. దీన్ని సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ప్రయోగించగా, బంగాళాఖాతంలో లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. 
 
సుఖోయ్ 30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి ప్రయోగించగా, బంగాళాఖాతంలోని ఓ లక్షిత ఓడను గురితప్పకుండా తాకింది. ఈ మేరకు భారత వాయుసేన ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. వాస్తవానికి ఇప్పటివరకు బ్రహ్మోస్ అనేక పరీక్షలను అధికమించి, శత్రుభీకర ఆయుధంగా పేరుగడించింది. 
 
బ్రహ్మోస్ మిస్సైల్ రేంజి 450 కిలోమీటర్లు. దీన్ని భూతలం, గగనతలం, నౌకల్లోని ప్రయోగించవచ్చు. ఇది ధ్వనివేగం కంటే మూడు రెట్లు అధిక వేగంతో ప్రయాణిస్తుంది. గరిష్టంగా మాక్ 2.8 వేగాన్ని అందుకోగలదు. తాజాగా చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో భారత వాయుసేన శక్తిసామర్థ్యాలు మరింతగా పెరిగాయని చెప్పొచ్చు.