శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2017 (16:27 IST)

తెలంగాణ ఐఏఎస్ చంద్రకళకు మోడీ డ్రీమ్ టీమ్‌లో చోటు.. స్వచ్ఛ భారత్ మిషన్ డైరక్టర్‌గా..

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ చంద్రకళకు అరుదైన గౌరవం దక్కింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డ్రీమ్ టీమ్‌లో ఆమెకు స్థానం లభించింది. ప్రధాన మంత్రి మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్‌కు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ చంద్రకళకు అరుదైన గౌరవం దక్కింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డ్రీమ్ టీమ్‌లో ఆమెకు స్థానం లభించింది. ప్రధాన మంత్రి మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్‌కు ఐఏఎస్ ఆఫీసర్ అయిన చంద్రకళను డైరక్టర్‌గా నియమించారు.

ఇంకా మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ శాఖలోనే ఆమెకు ఉప కార్యదర్శి పగ్గాలు అప్పగించారు. ఇటీవల బులందర్‌షెహర్, బిజ్నూర్, మీరట్ నగరాల్లో క్లీన్ ఇండియా ప్రచారాన్ని ఆమె విజయవంతంగా నిర్వహించారు. అందుకే ఆమె మోడీ కంటపడ్డారు. 
 
ఇంతేగాకుండా.. అక్రమార్కుల భరతం పడుతూ.. క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్న ఈమె.. యూపీలోని మీరట్ జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్‌గానూ ఈమెను ఫైర్ బ్రాండ్ ఉంది. 2008వ బ్యాచ్‌కు చెందిన యూపీ క్యాడర్ ఆఫీసర్ రెండేళ్ల క్రితం.. నాసిరకం రోడ్లేసిన అధికారులపై ఫైర్ అయ్యారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పటి నుంచి ఈమెకు నెటిజన్లతో పాటు ప్రజల సపోర్ట్ వుంది. అంతేగాకుండా ఈమె ఇప్పటికే అత్యుత్తమ ఐఏఎస్ ఆఫీసర్ అవార్డును కూడా గెలుచుకున్నారు.