బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

మీరు ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు గడిచిపోయిందా? అయితే ఇలా చేయండి..

e-aadhaar
కేంద్రం జారీచేసే ఆధార్ కార్డు ఇపుడు ప్రతి ఒక్కరికీ కీలకంగా మారింది. ప్రతి ఒక్క పనికీ ఆధార్ నంబరును అడుగుతున్నారు. అనుసంధానం చేస్తున్నారు. అలాంటి ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు గడిచిపోయిన వారు మాత్రం మళ్లీ గుర్తింపు, నివాస ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూఐడీఐ వెల్లడించింది. 
 
గత పదేళ్లలో ఆధార్​ను ఒక్కసారి కూడా అప్డేట్​ చేయని వారు ఈ పని చేయాలని కోరింది. అయితే.. ఐడెంటిటీ, రెసిడెన్స్ ప్రూఫ్​ డాక్యుమెంట్లను మళ్లీ సమర్పించడం తప్పనిసరి కాదని యూఐడీఏఐ స్పష్టం చేసింది. 
 
"పదేళ్ల క్రితం ఆధార్​ తీసుకుని, అప్పటి నుంచి తమ వివరాలను అప్డేట్ చేయని వారు.. డాక్యుమెంట్లను మళ్లీ సమర్పించాలని కోరుతున్నాం. గుర్తింపు పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలను నిర్దేశిత రుసుx చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు. 'మై ఆధార్' పోర్టల్​ లేదా సమీపంలోని ఆధార్ కేంద్రం నుంచి ఈ పని పూర్తి చేయవచ్చు' అని ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
దేశంలోని పౌరులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తూ ఆధార్​ కార్డులను కేంద్ర ప్రభుత్వం జారీచేస్తుంది. ఐరిస్​, వేలిముద్రలు, ఫొటోలను ఇందుకు ప్రామాణికంగా తీసుకుంటుంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక సహా వేర్వేరు అవసరాలను ఆధార్​ను ఉపయోగిస్తోంది.