మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Srinivas
Last Modified: బుధవారం, 16 మే 2018 (13:12 IST)

జేడీఎస్-కాంగ్రెస్ పొత్తుంటే కర్నాటకలో కమలం వాడిపోయేదా?

కన్నడ పీఠం కోసం అన్ని పార్టీలు పరీక్షనే ఎదుర్కొంటున్నాయి. అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించినా మ్యాజిక్ ఫిగర్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఏం చేసైనా సరే కర్ణాటక పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర

కన్నడ పీఠం కోసం అన్ని పార్టీలు పరీక్షనే ఎదుర్కొంటున్నాయి. అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించినా మ్యాజిక్ ఫిగర్ కోసం  ప్రయత్నాలు చేస్తుంది. ఏం చేసైనా సరే కర్ణాటక పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఓ పక్క రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదిలావుంటే కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జి కాంగ్రెస్‌, జేడీఎస్‌ల పొత్తు పెట్టుకుని కలిసి పోటీచేస్తే పరిస్థితి మరోలా ఉండేదని ట్వీట్ చేసింది.
 
ఆమె చేసిన ట్వీట్ అక్షర సత్యమన్నది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే అర్థమవుతుంది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎన్నికల ముందు పొత్తు పెట్టుకుని పోటీ చేసినట్లయితే మోడీకి షాక్ తగిలి కమలం వాడిపోయేదని ఓ ఆంగ్ల ప్రతిక కథనాన్ని ప్రచురించింది. బీజేపీ కేవలం 68 సీట్లకు మాత్రమే  పరిమితమయ్యేదని, కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి 156 సీట్లు గెలుచుకుని అధికారం కైవసం చేసుకునేదని తేల్చింది. ఇదే కాంబినేషన్‌లో 2019 ఎన్నికల్లో తలపడితే బీజేపీకి 28 పార్లమెంట్ స్థానాల్లో కేవలం 7 మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందంటూ కథనాన్ని ప్రచురించింది.