Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రియుడితో చాటింగ్... భర్త తన వాట్స్ యాప్ చూసాడని నరికేసింది...

మంగళవారం, 13 జూన్ 2017 (13:06 IST)

Widgets Magazine
murder1

భార్యాభర్తల సంబంధాలు రానురాను దారుణంగా మారిపోతున్నాయా అనిపిస్తోంది. ఎంతమాత్రం ఒకరిపై ఒకరికి విశ్వాసం లేకపోవడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, తేడా వస్తే ఒకరిని ఇంకొకరు చంపుకోవడం జరుగుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. 
 
వివరాలను చూస్తే.... బేరాఘర్ లోని ఖిలావలి గ్రామంలో నేత్రాపాల్, నీతూసింగ్ దంపతులున్నారు. వీరికి 2014లో వివాహం అయ్యింది. కానీ నీతూసింగుకు ఆల్రెడీ మరో అబ్బాయితో ఎఫైర్ వుంది. ఈ సంగతి తెలిసి భర్త నిలదీస్తే... అతడితో గొడవకు దిగింది. దాంతో చేసేది లేక అతడు ఆమె నుంచి దూరంగా వుంటున్నాడు కానీ విడాకులు ఏమీ తీసుకోలేదు. తాజాగా ఓ ఫ్యామిలీ వేడుకకు ఇద్దరూ వచ్చారు. 
 
ఆ సమయంలో నీతూ సింగ్ తన ప్రియుడితో జోరుగా చాటింగ్ చేస్తూనే వుంది. దాంతో చిర్రెత్తుకొచ్చిన భర్త నేత్రాపాల్ ఆమె చాటింగ్ చేస్తున్న ఫోనును అడిగాడు. అందుకామె తిరస్కరించింది. దాంతో అతడు ఫోనును బలవంతంగా ఆమె దగ్గర్నుంచి లాగేసుకున్నాడు. వెంటనే వాట్స్ యాప్ లో భార్య తన ప్రియుడితో చేసిన చాటింగ్ చూస్తూ వున్నాడు. 
 
తన భర్త చేష్టలను భరించలేని ఆ ఇల్లాలు ఓ కత్తిని తీసుకుని అతడి తలపై బలంగా నరికింది. దాంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి ప్రియుడిని తీసుకుని పారిపోయింది. తీవ్ర గాయాలపాలైన నేత్రాపాల్ ను బంధువులు ఆస్పత్రిలో చేర్పించారు. అతడికి ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత నీతూసింగ్, ఆమె ప్రియుడి ఆచూకి తెలుసుకుని పట్టుకుని చితకబాదారు. పోలీసులకు అప్పగించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళ అంత ఖర్చు చేసిందా? ఎమ్మెల్యేలకు రూ.6కోట్లు.. స్టింగ్ ఆపరేషన్‌పై విపక్షాల ఫైర్..

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తర్వాత ఆమె స్థానాన్ని కైవసం చేసుకునేందుకు చిన్నమ్మ శశికళ ...

news

ప్రేమించానని.. ఒకరోజు రాత్రంతా గడిపి.. ఆ తరువాత(వీడియో)

ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేయడం సాధారణమైపోయింది. ఒకరు ఇద్దరు కాదు. ఎంతోమంది అమ్మాయిలు ...

news

డయానా పెళ్లైన పది రోజుల్లోనే ఆ పని చేసిందా? పెళ్లైన ఏడాదిలోనే మృతి.. వీడని మిస్టరీ...

బ్రిటన్ యువరాణి డయానాకు సంబంధించిన షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. 1996 ఆగస్టు 28న ...

news

తిరుమల కొండల్లో చిన్నారి హత్య.. నాలుగేళ్ల చిట్టితల్లిని చెట్టుకు కట్టేసి.. సవతి తల్లి..?

పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో దారుణం జరిగింది. నాలుగేళ్ల బాలికను సవతితల్లి కిరాతకంగా ...

Widgets Magazine